Current Date: 05 Oct, 2024

బస్‌ డ్రైవర్‌పైకి పాము విసిరిన మహిళ పరుగో పరుగు

రోడ్డుపై ఆర్టీసీ డ్రైవర్ బస్సు ఆపలేదని ఆగ్రహించిన ఓ మహిళ కోపంతో  డ్రైవర్‌పైకి పాము విసిరింది. ఈ షాకింగ్ ఘటన  హైదరాబాద్‌లోని నల్లకుంటలో చోటు చేసుకుంది. విద్యానగర్ పరిధిలో ఓ మహిళ బస్సు కోసం వేచి ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన బస్సును చూసిన మహిళ చేయి అడ్డుపెట్టింది. కానీ  మహిళ మద్యం మత్తులో ఉందని గుర్తించిన డ్రైవర్  బస్సును ఆపకుండా ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆ మహిళ బస్సుపై బీరు బాటిల్‌ విసరడంతో బస్సు వెనక భాగంలో ఉన్న అద్దం ధ్వంసం అయింది. అద్దం పగలడంతో ఆగ్రహానికి గురైన బస్సు డ్రైవర్  బస్సు ఆపి, దిగి ఆమెను పట్టుకునేందుకు వెళ్లాడు. దాంతో మహిళ తన వద్ద ఉన్న బ్యాగులో నుంచి పామును తీసి ఆ బస్సు డ్రైవర్‌పైకి విసిరేసింది. పామును చూసిన భయపడిన డ్రైవర్ భయంతో పరుగులు తీశాడు. అనంతరం ప్రయాణికులు, బస్సు కండక్టర్ కలిసి ఆ మహిళను పట్టుకుని నల్లకుంట పోలీసులకి అప్పగించారు.

Share