Current Date: 15 Mar, 2025

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్న చిరంజీవి...

కాకినాడ జిల్లా పిఠాపురం స‌మీపంలోని చిత్రాడ‌లో నిర్వ‌హించిన వేడుక‌ల్లో జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్రసంగించారు. ప‌వ‌న్ స్పీచ్‌ను మెగా చిరంజీవి ప్రశంసించారు. ‘మైడియ‌ర్ బ్ర‌ద‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను. సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు.’ అంటూ సోష‌ల్ మీడియాలో చిరు రాసుకొచ్చారు.

Share