అనకాపల్లి జిల్లా కోటఉరట్ల మండలం అన్నవరం గ్రామంలో మహిళలు వర్షాలు కురవాలని బిందెలతో పసుపు నీళ్లు తీసుకుని అన్నవరం గ్రామంలో ఉన్న దేవాలయాలలో జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు కురవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా నారుమడులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, నారుమల్లు ఎండిపోకుండా నీటితో తడపాలంటే ఒక్కొ మడికి వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిగా వినాయకుని గుడి వద్ద అభిషేకం చేసిన మహిళలు అన్నవరం గ్రామంలో ఉన్న సూరమ్మ తల్లి గుడి, అడవి రాజబాబు గుడి, రామాలయంలో రాములవారికి, మరిడమ్మ తల్లికి, నూకాలమ్మ తల్లికి, ఆంజనేయస్వామికి మహిళలు పసుపు నీళ్లు బిందేలతో గ్రామంలో తిరుగుతూ దేవాలయాల వద్ద వద్ద అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Share