Current Date: 25 Nov, 2024

హడావుడిగా ఆసుపత్రిలో చేరిన నటుడు సాయాజీ షిండే..రీజన్ ఏంటంటే?

ప్రముఖ నటుడు సాయాజీ షిండే ఆసుపత్రిలో చేరారు. సతారాలో అతనికి గుండె శస్త్రచికిత్స జరిగింది. ఏప్రిల్ 11న‌ ఛాతీ నొప్పిగా అనిపించిన తర్వాత అతను ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సాయాజీ షిండేకు కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉంది. అందువల్ల అతను రొటీన్‌గా కొన్ని పరీక్షలు చేయించుకున్నాడు. ఈ సమయంలో ఈసీజీలో అతని గుండెలోని చిన్న భాగం ఆరోగ్యం కొంత క్షీణించినట్లు అనిపించిందన్నారు. ప్రస్తుతం సాయాజీ షిండే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

గురువారం మరోసారి ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే అతడికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షిండే త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటున్నారు. సాయాజీ షిండే మరాఠీ-హిందీ వినోద పరిశ్రమలో ప్రముఖ నటుడు. అతను మరాఠీ-హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, తెలుగు చిత్రాలలో పనిచేశాడు. నటనతో పాటు సినిమా ప్రొడక్షన్ కూడా చేశారు. నటుడు సాయాజీ షిండే చెట్ల ప్రేమికుడు కూడా.