రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పింఛన్లకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లను మంజూరు చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. నవంబర్ నుంచే కొత్త పింఛన్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. డిసెంబర్‌లో ఈ దరఖాస్తుల్ని పరిశీలించి జనవరిలో కొత్త పింఛన్‌లను అందజేయనున్నట్లు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సామాజిక భద్రత పింఛన్లపై సమీక్ష నిర్వహించారు.
Share