Current Date: 06 Oct, 2024

నీతి ఆయోగ్‌ భేటీలో మైక్ ఆఫ్ లేచి వెళ్లిపోయిన సీఎం మమతా

ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన నీతి ఆయోగ్ భేటీ నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలోనే వాకౌట్ చేశారు. తనకు మాట్లాడేందుకు సరిపడా టైం ఇవ్వలేదని.. అలానే మధ్యలో మైక్ ఆఫ్ చేయడంతో వాకౌట్ చేశారు. ఈ భేటీలో తన కంటే ముందు మాట్లాడిన వారికి 20నిమిషాల వరకు టైం ఇచ్చారని.. కానీ తనకు కేవలం 5నిమిషాలు మాత్రమే కేటాయించడంపై మమత మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ లో తమ రాష్ట్రాలపై పక్షపాతం చూపించారని ఆరోపిస్తూ నీతి ఆయోగ్ మీటింగ్ కు కర్ణాటక సీఎం సిద్దారామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ హాజరుకాలేదు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్ తోపాటు ఆప్ నేతృత్వంలోని పంజాబ్ ఢిల్లీ ప్రభుత్వాలు సైతం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాయి. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరిపినందుకు నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

Share