Current Date: 02 Jul, 2024

సీఆర్డీఏ కీలక ప్రకటన

వైసీపీ ప్రభుత్వం హయాంలో నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎలాంటి విధ్వంసం జరిగిందనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ‘సాహో అమరావతి’ అంటూ ఊపిరిపీల్చుకుంది. ఇప్పటికే ఒకసారి అమరావతిని చుట్టి వచ్చిన సీఎం చంద్రబాబు పనులు వేగవంతం చేయమని ఆదేశాలివ్వడం జరిగింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు చకచకా పనులు కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో.. రాజధాని అమరావతిలో చేపట్టనున్న ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు నోటిఫై చేస్తూ సీఆర్డీఏ గెజిట్ జారీ చేయడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాలు ఉండనున్నాయి. ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతమైన 1575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది.

Share