శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ఇన్‌ఫ్లో 1,42,241 క్యూసెక్కులు నమోదైన ఈ తరుణంలో, శ్రీశైలం అధికారులు 5 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోని నీటి మట్టం 515 అడుగులు, 141 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు, 312 టీఎంసీలు ఉంటుంది. ఈ జలాశయం స్పిల్‌వే ద్వారా 1.35 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 4.27 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.21 లక్షల క్యూసెక్కులుగా ఉంది. జలాశయంలోని ఎనిమిది టర్బైన్స్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైందని అధికారులు తెలిపారు. గత సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. తాజా సమాచారం ప్రకారం, మరో రెండు గేట్లను ఎత్తినట్లు వెల్లడించారు. వర్షం వల్ల పోటెత్తిన నీరు, శ్రీశైలం జలాశయాన్ని చూస్తు పెద్ద సంఖ్యలో సందర్శకులు అక్కడ చేరుకుంటున్నారు. జలాశయ గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.7 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.9 టీఎంసీలుగా నమోదైంది.
Share