టిఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కుంభకోణాలపై విచారణ జరిపేందుకు రేవంత్ సర్కార్ రిటైర్డు జస్టిస్ ఎల్. నరసింహా రెడ్డి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ను నియమించింది.ఈ కమిషన్ నియామకం చెల్లదంటూ కెసిఆర్ సుప్రీంను ఆశ్రయించారు.కమిషన్ విచారణ కొనసాగించడానికి అనుమతించిన సుప్రీంకోర్టు నరసింహారెడ్డి ని తప్పించి మరొక న్యాయమూర్తితో విచారణ కొనసాగించవచ్చని తీర్పు ఇచ్చిన తర్వాత, రేవంత్ సర్కారు జస్టిస్ లోకూర్‌ను కొత్త న్యాయ విచారణ కమిషన్‌కి నియమించింది.మధన్ భీమ్ రావు లోకూర్ సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన 2012 నుంచి 2018 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు.జస్టిస్ లోకూర్ 1977లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్.ఎల్.బి. డిగ్రీ పొందారు. సుప్రీం కోర్టు మరియు ఢిల్లీ హైకోర్టుల్లో న్యాయవాదిగా సేవలందించి, 1999లో ఢిల్లీ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Share