వైసీసీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతారనే వదంతులు ఇటీవల ముమ్మరంగా వినిపించాయి. కానీ.. ఆయన నివాసం, కార్యాలయాల మీద ఏకకాలంలో ఐటీ అధికారులు దాడి చేసి.. సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా తేలితే.. టీడీపీ చేరడం అనే ప్రక్రియ వాయిదా పడడం కానీ, రద్దు అయ్యే అవకాశం ఉంది. భీమవరం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్‌ను గ్రంధి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో ఓడించి జైంట్ కిల్లర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ.. 2024ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీతో ఆంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. తొలుత జనసేనలో చేరాలని గ్రంధి ఆశించినా.. తనను ఓడించిన గ్రంధి శ్రీనివాస్ చేర్చుకోవడానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదని తెలుస్తోంది. అలానే టీడీపీ కూడా అతడ్ని చేర్చుకోవడానికి సంకోచిస్తోంది.
Share