Current Date: 26 Nov, 2024

విరాట్ కోహ్లీకి ఏమైంది.. 10 ఏళ్ల తర్వాత వరస్ట్ ర్యాంక్

విరాట్‌ కోహ్లీ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారాడు. న్యూజిలాండ్‌తో ఇటీవల ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 93 పరుగులే చేసిన విరాట్‌.. ఐసీసీ విడుదల చేసిన టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 8 స్థానాలు దిగజారి 22వ స్థానానికి పడిపోయాడు. 2014 ఇంగ్లండ్‌ సిరీస్‌ వైఫల్యం తర్వాత 24వ స్థానంలో నిలిచిన కోహ్లీ.. ఈ స్థాయిలో పడిపోవడం ఈ 10 ఏళ్లల్లో ఇదే ప్రథమం. టీమ్‌ఇండియా సారథి రోహిత్‌ శర్మ కూడా 2 స్థానాలు దిగజారి 26వ స్థానంలో ఉన్నాడు. యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ 5 స్థానాలు మెరుగుపరుచుకుని 6వ స్థానంలో నిలిచి మరోసారి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో జో రూట్‌, కేన్‌ విలియమ్సన్‌ తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉండగా యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ ఒక ర్యాంక్‌ దిగజారి 4వ ర్యాంకుతో సరిపెట్టుకున్నాడు. బౌలర్ల జాబితాలో రబాడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా హెజిల్‌వుడ్‌, బుమ్రా, కమిన్స్‌, అశ్విన్‌, జడేజా టాప్‌-6లో ఉన్నారు.

Share