Current Date: 26 Aug, 2026

ఇవాళ భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.