టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్.. ఐసీసీ అందించే ఓ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నాడు. ఫిబ్రవరి నెలకు గాను అతడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఈ అవార్డును అందుకున్న భారత క్రికెటర్‌గా గిల్ రికార్డులకు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 259 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు అర్థశతకాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ నిలిచాడు. టీమ్ఇండియా 3-0తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్గును గిల్ గెలుచుకోవడం ఇది మూడోసారి. 2023వ సంవత్సరంలో జనవరి, సెప్టెంబర్ నెలల్లో గిల్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రెండు సార్లు ఈ పురస్కారాన్ని పొందాడు.
Share