Current Date: 15 Mar, 2025

సౌతిండియా అఖిలపక్ష సమావేశానికి జగన్ కు పిలుపు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన నివాసంలో తమిళనాడు మంత్రి ఈవీ వేలు, డీఎంకే రాజ్యసభ సభ్యుడు విల్సన్ బుధవారం కలిశారు. ఈ నెల 22న చెన్నైలో జరగనున్న సౌత్ ఇండియా అఖిలపక్ష నాయకుల సమావేశానికి వైఎస్ జగన్‌ను వారు ఆహ్వానించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను వైఎస్ జగన్‌కు డీఎంకే నేతలు అందజేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మాత్రం ఇండియా కూటమిలో ఉన్నారు. వ్యక్తిగతంగా స్టాలిన్‌తో జగన్ కు స్నేహం ఉంది. ఆ కారణంగానే 2019లో జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పోరాటం సాగించే స్టాలిన్‌తో జట్టుకడతారా ? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. రాజకీయవర్గాల్లోనూ ఇది చర్చనీయాంశమైంది.

Share