Current Date: 10 Aug, 2026

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిరాశ

అల్లు అర్జున్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుని ఇన్నార్బిట్‌ మాల్‌లో <<20602729>>AAA <<>>సినిమాస్‌ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. భద్రతా కారణాలతో మాల్‌లోకి ఎవరినీ అనుమతించమని పోలీసు అధికారులు తెలిపారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సిగ్నల్‌ పాయింట్‌ను పోలీసులు ఆదివారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లకుండా సింగ్నల్ పాయింట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.