Current Date: 08 Aug, 2026

ఎన్టీఆర్ డైలాగ్‌తో వివాదంలోకి ‘కొరియన్ కనకరాజు’ మూవీ.. రచ్చరచ్చ

వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ మూవీ వివాదంలో చిక్కుకుంది. చిత్రంలో కల్ట్ కమెడియన్ సత్య దెబ్బలు తిన్న అనంతరం.. సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాలోని హావభావాలను అనుకరిస్తూ “నీ స్ట్రోక్స్ చాలా ఇమెచ్యూరిష్‌గా ఉన్నాయి” అంటూ చెప్పిన పేరడీ డైలాగ్‌పై నందమూరి అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమా విడుదలకంటే కొన్నిరోజుల ముందే ఆ పాత వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో కావాలనే వైరల్ చేసి, ప్లాన్ ప్రకారమే మెగా కాంపౌండ్ నటులు సీనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారని ఆరోపిస్తూ నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు.  అయితే, గతంలోనూ సత్య అనేకమంది అగ్ర కథానాయకులను సరదాగా అనుకరించాడని, ఇది కేవలం హాస్యం కోసమే తప్ప ఎవరినీ కించపరిచే ఉద్దేశం కాదని మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదంపై స్పందించిన హీరో వరుణ్ తేజ్.. ట్రోలింగ్‌కు, ఇమిటేషన్‌కు చాలా తేడా ఉంటుందని, గొప్ప నటులను అభిమానంతో అనుకరించడం చిత్ర పరిశ్రమలో సాధారణమని స్పష్టం చేశాడు. ఎవరి మనోభావాలనూ దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చాడు. కానీ.. నందమూరి ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు. రివర్స్‌లో మెగా హీరోలను ట్రోల్ చేస్తూ కౌంటర్స్ ఇస్తున్నారు.