ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇన్‌స్టాలో రీల్స్ చూస్తోందని భర్త హత్య చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిహార్‌కు చెందిన ధీరజ్ కుమార్(24), రీమా కుమారి(20) ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. ప్రైవేట్ జాబ్ చేసే రీమా వంట, ఇంటి పనులు చేయకుండా రీల్స్ చూస్తోందని ధీరజ్ గొడవపడ్డాడు. కోపంలో గొంతు నులిమి చంపేశాడు. ఆమె ఫ్రెండ్స్ ఇంటికి వెళ్లి చూడగా బెడ్‌లో దాచిన బాడీ కనిపించింది. పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు.