Current Date: 08 Aug, 2026

యూజర్లకు UPI లావాదేవీలు ఉచితమే

యూజర్లకు UPI లావాదేవీలు ఉచితమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. UPI ఛార్జీల వసూళ్ల బిల్లుకు LS ఆమోదంతో MDR భారం చివరికి ప్రజలపై పడుతుందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చేసిన ఆరోపణలను ఖండించారు. అవి నిరాధారమని చెప్పారు. 'వ్యాపారులు, బ్యాంకులు, ఫిన్హక్లకే MDR వర్తిస్తుంది. యూజర్లకు కాదు. దాని అమలుపై UPI, NPCI సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది' అని తెలిపారు.