తల్లికి వందనం పథకం అందని వారి నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు ఈ నెల 7తో ముగిసింది. ఈ ఏడాది కొత్తగా స్కూలులో చేరిన వారు, ఇంటర్ విద్యార్థుల నుంచి దరఖాస్తులకు ఈ నెల 25 వరకు అవకాశం ఉంది. వీటిని పరిశీలించిన అనంతరం ఈ నెల 30న అర్హుల జాబితాను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అదే రోజు వారి అకౌంట్లలో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.