Current Date: 10 Aug, 2026

శ్రీవారి దర్శనానికి 20 గంటలు

 తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం శ్రీవారిని 87,658 మంది దర్శించుకున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20-24 గంటలు పడుతోంది. రద్దీతో కంపార్ట్‌మెంట్లు అన్ని నిండిపోయి లైన్ గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు చేరింది. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం ₹4.13కోట్లు సమకూరిందని టీటీడీ వెల్లడించింది.