Current Date: 12 Feb, 2026

అల్లు అర్జున్‌పై కొత్త వివాదం.. కావేరి షాకింగ్ కామెంట్స్!

అల్లు అర్జున్‌పై ఒక బ్రాండింగ్ వ్యూహకర్త చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో కలకలం రేపాయి. "బన్నీ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడకూడదు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు" అంటూ కావేరి అనే మహిళ చేసిన వ్యాఖ్యలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో అల్లు అర్జున్ టీమ్ వెంటనే రంగంలోకి దిగింది. సదరు మహిళ చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమని ఒక ప్రెస్ నోట్ ద్వారా ఖండించింది. ఈ తప్పుడు వ్యాఖ్యలను తాము సీరియస్ గా తీసుకుంటున్నామని, బాధ్యులపై పరువు నష్టం దావా వేసేందుకు తమ లీగల్ టీమ్ సిద్ధమవుతోందని స్పష్టం చేసింది. అల్లు ఆర్మీ కూడా సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలపై విరుచుకుపడటంతో, సదరు ఇంటర్వ్యూను ప్రసారం చేసిన యాంకర్ ఆ వీడియో క్లిప్‌ను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. కొందరు నెటిజన్లు బన్నీ పీఆర్ టీమ్ తీరును తప్పుబడుతుంటే, మరికొందరు మాత్రం తమకు బన్నీతో ఉన్న వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. తాము కలిసినప్పుడు ఆయన చాలా మర్యాదగా ప్రవర్తించారని పోస్టులు పెడుతున్నారు.