పుణే టెస్ట్‌లో టీమిండియా కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే చేతులెత్తేసింది. న్యూజిలాండ్ బౌలర్ మిచెల్ శాంట్నర్ 53 పరుగులు ఇచ్చి ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్ 259 పరుగులు చేసింది. దీంతో భారత్ 103 పరుగులు వెనుకబడింది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడెజా 30, శుభ్‌మన్ గిల్ 30, యశస్వి జైశ్వాల్ 30 పరుగులు చేశారు. రోహిత్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్, రిషబ్ పంత్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకు భారత్‌తో జరిగిన 5 డే టెస్ట్ మ్యాచ్‌లలో 7 వికెట్లు తీసిన కివీస్ బౌలర్ల జాబితాలో మిచెల్ శాంట్నర్ నిలిచాడు.