Current Date: 26 Nov, 2024

నేడు ఢిల్లీలో అమిత్ షా తో పవన్ కల్యాణ్ భేటీ

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ రోజు ఢిల్లీకి వెళుతున్నారు. ఈ రోజు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత వెలగపూడి సచివాలయం నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 3.30 గంటలకు విమానంలో బయలుదేరి 5,45 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి నేరుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నివాసానికి వెళ్లి 6.30 నుండి 7 గంటల వరకూ ఆయనతో సమావేశం అవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక విషయాలపై అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు తదితర కీలక అంశాలపై చర్చించనున్నారు.

Share