Current Date: 26 Nov, 2024

సీనియర్ ఐఏఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని గౌరవప్రదంగా సాగనంపుతున్న ఏపీ ప్రభుత్వం....

సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ఏపీలోని కూట‌మి ప్రభుత్వం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. గౌరవప్రదంగా సాగనంపాల‌నే ఉద్దేశంతో స‌ర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. దీనిలో భాగంగా గోపాలకృష్ణ ద్వివేదికి ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమ విభాగం ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ప్ర‌స్తుతం ఆ పోస్టును పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌ల‌తో పోలా భాస్క‌ర్ నిర్వ‌హిస్తున్నారు. గోపాలకృష్ణ ద్వివేది ఈ నెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేస్తుండ‌టంతో ఆయ‌నను గౌరవప్రదంగా సాగనంపేందుకు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇక వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వివాదాస్ప‌ద అధికారులుగా పేరొందిన వారికి కూట‌మి స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పోస్టింగులు ఇవ్వ‌కుండా ప‌క్క‌నపెట్టింది.

Share