భారత జట్టు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యని కష్టాలు వెంటాడుతున్నాయి. టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించినా.. అందుకు తగినట్లు అతనికి గుర్తింపు రాలేదు. టీ20 కెప్టెన్సీ చేజారింది. అలానే ఇటీవల అతని భార్య విడాకులు తీసుకోగా తాజాగా టీమిండియా కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కండీషన్స్‌తో హార్దిక్‌ను ఇరుకున పెట్టేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కాలంటే ఫిట్ నెస్ నిరూపించుకోడం అనివార్యమని హెచ్చరించాడు. వన్డే మ్యాచ్‌ల్లో బ్యాటింగ్, ఫీల్డింగ్ చేయడంతో పాటు కనీసం 8-10 ఓవర్లు బౌలింగ్ చేసి తీరాల్సిందేనని పాండ్యాకు గంభీర్ ఆదేశించాడు. హార్దిక్ వన్డే మ్యాచ్‌ను పూర్తి స్థాయిలో ఆడాలంటే కొన్ని రోజులు దేశవాళీ క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆడాల్సిందే. కానీ.. గత కొన్నేళ్లుగా అతను కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ తర్వాత తనే కెప్టెన్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్‌ను శ్రీలంక టూర్‌కి కెప్టెన్‌గా బీసీసీఐ ప్రకటించింది. ఫిటెనెస్, మెంటల్ కండీషన్ సరిగా లేకపోవడంతోనే హార్దిక్‌ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.