Current Date: 26 Nov, 2024

మోడీ ఆస్తి..నాలుగు ఉంగరాలే!!

 వారణాసిలోఎంపీగా నామినేషన్ వేసిన ప్రధాని మోడీ తన అఫిడవిట్‌ లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ అఫిడవిట్ ప్రకారం.. ప్రధాని మోడీ చేతిలో ప్రస్తుతం రూ.52,920 ఉండగా.. గాంధీనగర్‌ లోని ఎస్‌.బీ.ఐ బ్రాంచ్‌ అకౌంట్ లో రూ.73,304.. ఎస్‌.బీ.ఐ వారణాసి బ్రాంచ్‌ లో రూ.7వేలు ఉన్నాయి. ఫిక్స్‌ డ్ డిపాజిట్ గా రూ.2,85,60,338 ఉన్నాయని వెల్లడించారు! అదేవిధంగా.. తనకు రూ.2,67,750 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయని మోడీ తెలిపారు. వీటితో పాటు పలు ఇన్సూరెన్స్ పాలసీలు.. మొత్తం కలిపి సుమారు రూ.3.02 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రధాని మోడీ తన అఫిడవిట్ లో వెల్లడించారు! కాగా గత 10 సంవత్సరాలుగా ప్రధానిగా కొనసాగుతున్న మోడీ... అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేసిన సంగతి తెలిసిందె.