Current Date: 26 Nov, 2024

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత

వైసీపీ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అందజేయనున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా 2021 అక్టోబర్‌ 19న ఆ పార్టీకి చెందిన మూకలు టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డాయి. వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు దాడి చేశారు. చంద్రబాబు నివాసంపై మాజీ మంత్రి జోగి రమేశ్‌, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ తదితరులు తమ అనుచరులతో దాడికి వెళ్లారు. నిందితుల్లో నందిగం సురేశ్‌ సహా పలువురిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో విచారణ వేగవంతానికి కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Share