ఏటా దసరా సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు గ్రామాల ప్రజలు మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను దక్కించుకునేందుకు కర్రలతో తలపడతారు. సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా బన్నీ ఉత్సవాన్ని నిర్వహించారు. అయితే, ఆవారం తెల్లవారుజామున జరిగిన కర్రల సమరంలో హింస చెలరేగిం. కర్రలతో ఇరువర్గాల ప్రజలు కొట్టుకోవడంతో 100 మంకి పైగా గాయాలపాలయ్యారు. వారిలో 20 మంకి తీవ్రగాయాలు కావడంతో ఆదోని, బళ్లారి ఆస్పత్రులకు తరలించారు. ఉత్సవాన్ని తిలకించేందుకు సమీప ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతా మూర్తులను కాపాడుకోడానికి నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపున.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపున కర్రలతో తలపడతారు. ఈ నేపథ్యంలో కొందరు గాయపడుతుంటారు.
Share