Current Date: 14 Nov, 2024

వైయస్ షర్మిల కోరితే.. భద్రత కల్పిస్తామన్న పవన్ కళ్యాణ్

వైయస్ షర్మిల కోరితే ప్రభుత్వం వైపు నుండి ఆమెకి భద్రతను కల్పించేందుకు తాము సిద్ధమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పి అధికారులను ఇష్టం వచ్చినట్లుగా వాడుకున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారులను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని వారి చేత కూడా తప్పులు చేయించారని తెలిపారు. ప్రస్తుతం అధికారులు తమ విధులను బాధ్యతతో పూర్తిచేస్తున్నారని చెబుతూ, మీరు ఇంకా వారిని బెదిరించాలని చూస్తే ఎవరూ బెదిరిపోరు అని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ఒకవేళ అధికారులకు ఏదైనా హాని కలిగించాలని చూస్తే వారికి చిన్న గీత పడినా చూస్తూ ఊరుకోం అని తేల్చిచెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు, ఇతర అధికారులను ఇప్పటికీ కూడా బెదిరించాలని చూస్తే సుమొటోగా కేసులు పెట్టాల్సి వస్తుందని సదరు నాయకులను హెచ్చరించారు.

Share