ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్బంగా విశాఖలో రుషికొండపై జగన్ నిర్మించిన ప్యాలెస్‌పై అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. రుషికొండపై నిర్మాణాలకు రూ. 409 కోట్లు కేటాయించారని, ఈ నిర్మాణాలు జగన్ విధ్వంసానికి పరాకాష్ట అని అన్నారు. అక్కడకు ఎవరిని వెళ్లనీవ్వకుండా అడ్డుకున్నారని, మేము ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తు చేస్తే అతి కష్టం మీద నెల తరువాత సమాధానం వచ్చిందన్నారు. రుషికొండ రిసార్ట్స్‌ను జగన్ కావాలనే డిస్ట్రక్షన్ ప్రారంభించారని, రిసార్డ్‌లను కూల్చేసి ఏమి కడుతున్నారో కూడా ఎవరికీ చెప్పలేదని విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. ఒక నియంత పాలనలో అధికారులు వ్యవహరించిన తీరుపై కూడా అభ్యంతరాలు ఉన్నాయన్నారు. 1 లక్ష 40 వేల చదరపు అడుగులు నిర్మాణాలు చేసారని, దీనికి మాత్రం 451 కోట్లు రూపాయలు నిధులు శాంక్షన్ చేసారన్నారు. చదరపు అడుగు నిర్మాణానికి 28 వేల 096 రూపాయలు ఖర్చు అయిందని, ఇంత ఖర్చు పెట్టీ పేదలకు, పెద్దలకు పోరాటం అని పేర్కొంటూ జగన్ బిల్డ్ అప్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Share