దక్షిణాఫ్రికా గడ్డపై రెండో టీ20లో భారత్ జట్టు ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సఫారీ బౌలర్ల దెబ్బకి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో హార్దిక్ పాండ్యా 39 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత్ ఆదిలో సక్సెస్ అయినట్లే కనిపించింది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. కానీ.. అతనికి మిగిలిన బౌలర్ల నుంచి సహకారం లభించలేదు. దాంతో 19 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గత శుక్రవారం జరిగిన తొలి టీ20లో భారత్ జట్టు 61 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. నాలుగు టీ20ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక మూడో టీ20 మ్యాచ్ బుధవారం రాత్రి 8.30 గంటలకి జరగనుంది.
Share