Current Date: 07 Jun, 2026

మరోసారి పెరిగిన గ్యాస్ ధరలు

దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి. 14.2 KGల గృహ వినియోగ (డొమెస్టిక్) LPG సిలిండర్పై రూ.29 మేర పెంచారు. ఇవి నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఢిల్లీలో ధర రూ.913 నుంచి రూ.942కు పెరగనుంది. హైదరాబాద్లో రూ.965 నుంచి రూ.994కు చేరనుంది. 3 నెలల గ్యాప్లో డొమెస్టిక్ సిలిండర్ రేట్లు పెరగడం ఇది రెండోసారి.