డిజిటల్ పేమెంట్ రాకతో బ్యాంకింగ్ సేవల్లో ఏదైనా ఆలస్యం అవుతోందీ అంటే అది చెక్కుల క్లియరెన్సే. దశాబ్దాలుగా ఈ చెక్‌ల క్లియరెన్స్ సమస్య అలానే ఉంది. ఇప్పటికీ ఎవరైనా తమ పేరు మీద చెక్కు ఇస్తే దాన్ని నగదు రూపంలో మార్చుకోవడానికి రెండ్రోజులు పడుతోంది. దాంతో ఎట్టకేలకి సుదీర్ఘ విరామం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై దృష్టిసారించింది. కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ జరిగేలా సంబంధిత ప్రక్రియలో కీలక మార్పును ప్రకటించింది. బ్యాంకు పని గంటల్లో చెక్కును స్కాన్ చేసి, ప్రజెంట్ చేసి, కొన్ని గంటల్లోనే పాస్ చేస్తారు. దాంతో ఇకపై కొన్ని గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ పూర్తవుతుంది. యూపీఐ ద్వారా పన్ను చెల్లింపుల పరిమితిని ఒక్కో లావాదేవీకి రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పాలసీ నిర్ణయించింది. ఫలితంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు చేసేవారు ఒక లావాదేవీలో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంది. టాపప్ లోన్లు, బంగారు రుణాలను ఇవ్వడంలో ఆర్థిక సంస్థలు పెద్దగా నిబంధనలను పాటించడం లేదన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశాలు ఒకవైపు పెరుగుతుంటే.. బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతున్నాయన్నారు.
Share