Current Date: 27 Nov, 2024

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక

ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్  వద్ద మరి కొద్దిసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. గోదావరి వరద ఉదృతి క్రమక్రమంగా పెరుగుతోంది. గోదావరి నీటిమట్టం ప్రస్తుతం 11.70 అడుగులకు చేరుకుంది. 11.75 అడుగులకు నీటిమట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు జారీ చేయనున్నారు. 9.86 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి 9 లక్షల 86 వేల క్యూసెక్కుల వరద సముద్రంలోకి విడుదల కానుంది.

Share