Current Date: 26 Nov, 2024

ఎమ్మెల్యేకి అర్ధరాత్రి అమ్మాయి న్యూడ్ కాల్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన హనీ ట్రాప్‌లు!

తెలంగాణలోని ఓ ఎమ్మెల్యేలకు యువతి న్యూడ్ వీడియో కాల్ చేయటం కలకలం రేపింది. ఆందోళనకు గురైన సదరు ఎమ్మెల్యే వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని నెంబర్ నుంచి వీడియో కాల్‌ వచ్చింది. ఎవరా అని చూసిన సదరు ఎమ్మెల్యే కాల్ లిఫ్టే చేశాడు. అంతే అవతలి వైపు నుంచి ఓ యువతి నగ్నంగా తెరపై కనిపించింది. షాక్‌కు గురైన ఎమ్మెల్యే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ కట్ చేసాడు. అనంతరం వీడియో కాల్ ఘటనపై తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రాజకీయంగా తనను దెబ్బ తీయటానికి ఎవరైనా ఇలా వీడియో కాల్ చేశారా..? లేక లేక నిజంగానే గుర్తుతెలియని సైబర్ నేరగాళ్లే డబ్బుల కోసం చేసి ఉంటారా? అని అనుమానం వ్యక్తం చేశారు. పొలిటికల్‌గా తనను డ్యామేజ్ చేయటం కోసం, బ్లాక్‌మెయిల్ చేసే ఉద్దేశంతోనే కాల్ చేసి ఉంటారని భావించి వెంటనే నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌కు కంఫ్లైంట్ చేశారు. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని చెబుతున్నారు. ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే ముఖం కనిపించకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. 

Share