మహిళల టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. షార్జాలో జరిగిన రెండో సెమీస్‌లో వెస్టిండీస్‌ను న్యూజిలాండ్ చిత్తు చేసింది. కివీస్ ఎనిమిది పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌కి దూసుకెళ్లింది. దుబాయి వేదికగా ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ బౌలర్ డాటిన్ 22 పరుగులకే 4 వికెట్లు తీయడంతో కివీస్ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. ఆ తర్వాత 129 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు 8 వికెట్లకు 120 పరుగులే చేసింది. దీంతో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది.
Share