టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ మళ్లీ గాయపడ్డాడు. న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సర్జరీ అయిన మోకాలికే బంతి బలంగా తాకింది.. దాంతో మోకాలికి వాపు రావడంతో ముందు జాగ్రత్త చర్యగానే పంత్‌ను మ్యాచ్ మధ్యలోనే డ్రెస్సింగ్‌రూమ్‌కి పంపించారు. భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 2022లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ దుర్ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడినా తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించాడు. అనేక సర్జరీల అనంతరం కోలుకున్న ఈ ఉత్తరాఖండ్ క్రికెటర్.. దాదాపు 630 రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం టీ20 ప్రపంచకప్-2024లో పాల్గొని టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్ సందర్భంగా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన పంత్.. శతకంతో అదరగొట్టాడు. కానీ న్యూజిలాండ్‌తో టెస్టులో మళ్లీ గాయపడ్డాడు.
Share