కుటుంబం కోసం ఇల్లు కొనడం ప్రతి ఒక్కరి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి భారతదేశంలోని చాలా మంది తమ తాహతుకి మించి బడ్జెట్‌ను కేటాయిస్తున్నారు. ఈరోజుల్లో ఇల్లు కూడా విలాసానికి చిహ్నం. దీనిని పరిగణనలోకి తీసుకుని డీఎల్‌ఎఫ్ దేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్-లగ్జరీ హై-రైజ్ కండోమినియం ‘‘డీఎల్‌ఎఫ్ ది డాలియా’’ను డెవలప్ చేస్తోంది. గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో ఇది ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్ విలువ రూ.34,000 కోట్లు. ఇది దేశంలోని అన్ని నివాస ప్రాజెక్టుల కంటే 2.5 రెట్లు ఎక్కువ.డహ్లియాస్ 17 ఎకరాల్లో విస్తరించి ఉంది. 29 అంతస్తుల్లో సుమారు 9,500 నుండి 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 400 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను ‘‘డీఎల్‌ఎఫ్ ది డాలియా’’లో నిర్మిస్తున్నారు. అక్కడే 2,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే క్లబ్‌హౌస్‌ను కూడా నిర్మించాలని యోచిస్తోంది.ప్రాప్‌ఈక్విటీ ప్రకారం, ఈ విలాసవంతమైన గృహాల ధర చదరపు అడుగుకు రూ.80,000, సగటున ఒక ఇలు సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇంతకుముందు డీఎల్‌ఎఫ్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన నివాస ప్రాపర్టీలలో ఒకటైన ది కామెలియాస్‌ను అభివృద్ధి చేసింది.
Share