శ్రీలంకతో పల్లెకల్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తొలి రెండు మ్యాచుల్లో ఈజీగా గెలిచిన భారత్‌కు మూడో మ్యాచ్‌లో లంకేయుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగాఅనంతరం ఛేదనకు దిగిన శ్రీలంక టీమ్ ఓ దశలో 15.1 ఓవర్లలో శ్రీలంక ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 110 పరుగులు చేసి ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఈ దశలో భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. లాస్ట్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్‌లో ఆశ్చర్యకర నిర్ణయాలు తీసుకున్నాడు. 19వ ఓవర్‌ను ఎప్పుడూ బౌలింగ్ చేయని రింకూ సింగ్‌తో వేయించి 20వ ఓవర్‌లో తనే స్వయంగా బౌలింగ్ చేసి కట్టడి చేశాడు. దాంతో మ్యాచ్ శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగా స్కోరు సమం కావడంతో సూపర్ ఓవర్ తప్పలేదు.సూపర్ ఓవర్‌లో శ్రీలంక కేవలం 2 పరుగులే చేయగా భారత్ మొదటి బంతికే బౌండరీతో విజయాన్ని సాధించింది. దాంతో మూడు టీ20ల సిరీస్‌ను కూడా 3-0తో కైవసం చేసుకుంది.
Share