Current Date: 05 Aug, 2026

పిడుగుపాటుకు వ్యక్తి మృతి

అనకాపల్లి జిల్లా  దేవరాపల్లి మండలం   ఎం. అలమండలో సోమవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై సిరిపరపు పోలినాయుడు (51) మృతి చెందాడు. ఆళ్ల నాయుడు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని ఎం. అలమండ గ్రామ సమీపంలో పోలినాయుడు పొలం పని కోసం ఆళ్ల నాయుడుతో కలిసి వెళ్లారు.    పొలంలో పారపని చేస్తుండగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. అదే సమయంలో వారికి సమీపంలో పిడుగు పడటంతో పోలినాయుడు శరీరం పూర్తిగా కాలిపోయింది. స్థానికులు వెంటనే కె. కోటపాడు సి హెచ్ సి కి తరలించిన ఫలితం లేకపోయింది. ఆళ్ల నాయుడు ను గ్రామ సమీపంలోకి తీసుకువచ్చి ప్రథమ చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. మృతి చెందిన  పోలినాయుడు మృతదేహాన్ని  కే కోటపాడు సి.హెచ్.సి. మార్చురీలో భద్రపరిచారు .