Current Date: 14 Mar, 2025

ఇవిగో రూ.800, రూ.900 నాణేలు ...

రూ. 1, 2, 5, 10, 20 నాణేలు రోజూ చూస్తూనే ఉంటాం.. కానీ రూ.800 నాణేలను ఎప్పుడైనా చూశారా? రూ.900 నాణెం కూడా ఉందని తెలుసా..? పలువురు ప్రముఖుల స్మృతి చిహ్నంగా మింట్ చాలా కొద్ది సంఖ్యలో ఇలాంటి నాణేలను ముద్రిస్తుంటుంది. ఇలా ముద్రించిన నాణేలను ప్రత్యేకంగా అమ్మకానికి పెడుతుంది. తాజాగా పొట్టి శ్రీరాములు జిల్లా అనుమసముద్రం గ్రామానికి చెందిన మహ్మద్‌ వాయిస్‌ రూ.800, రూ.900 నాణేలను తెప్పించుకున్నాడు. దేశంలో తొలిసారి విడుదలైన ఈ నాణేలను ఫిబ్రవరి 20న ఆన్ లైన్ లో ఆర్బీఐ అమ్మకానికి పెట్టింది. వెంటనే ఆర్డర్ చేయగా మార్చి 10న తనకు అందాయని వాయిస్ చెప్పారు. జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి జయంతి సందర్భంగా ముంబయి మింట్ ఈ నాణేలను ముద్రించింది. వెండితో తయారు చేసిన ఈ నాణేలు ఒక్కోటి 40 గ్రాముల బరువుంటుందట.

Share