Current Date: 04 Jun, 2026

కోహ్లీ కారణంగా ఐపీఎల్ విజేత కెప్టెన్‌కు దక్కని గౌరవం!

ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించినప్పటికీ ఒక్కటంటే ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయారు. కానీ, రజత్ పాటీదార్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తొలి ఏడాదే జట్టుకు ఛాంపియన్‌గా నిలిపి దశాబ్దాల టైటిల్ కరవును తీర్చాడు. అంతటితో ఆగకుండా, వరుసగా రెండో ఏడాది కూడా జట్టుకు కప్పును అందించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు.ఇటు ఆటగాడిగా, అటు సారథిగా అద్భుతంగా రాణించి జట్టు వరుసగా రెండు టైటిళ్లు సాధించడంలో కీలకపాత్ర పోషించినప్పటికీ, అతడికి దక్కాల్సిన తగినంత గుర్తింపు లభించలేదనే వాదనలు క్రికెట్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పాటీదార్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక టాక్ షోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘రజత్ పాటీదార్ మరోసారి అదరగొట్టాడు. అతను పెద్ద స్టార్ క్రికెటర్ కాకపోవచ్చు.. పైగా విరాట్ కోహ్లీ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడు అదే జట్టులో ఉండటంతో అందరి దృష్టి, చర్చా కోహ్లీ చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ, పాటీదార్ ఒక కెప్టెన్‌గా జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టాలో బాగా తెలిసిన నాయకుడు’’ అని క్లార్క్ కొనియాడాడు. లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఆర్సీబీకి బ్యాక్-టు-బ్యాక్ టైటిళ్లు అందించిన పాటీదార్ ప్రతిభను అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ మాజీ ఆసీస్