ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుందో మాల్దీవులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. భారత్‌తో మాల్దీవుల ప్రభుత్వం కయ్యానికి దిగడంతో అసలుకే ఎసరు వచ్చింది. దాంతో పర్యాటకం రూపంలో మాల్దీవులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
చైనా అనుకూల విధానాన్ని అవలంబిస్తూ మాల్దీవుల ప్రభుత్వం.. భారత్‌తో కయ్యానికి దిగింది. దాంతో ప్రధాని మోడీ స్వయంగా రంగంలోకి దిగి మాల్దీవులకి బదులు లక్ష్యదీప్‌లో పర్యటించి ఫోటో షూట్‌ను విడుదల చేశారు. దాంతో.. భారతీయులందరూ మాల్దీవులను వదిలేసి.. లక్ష్యదీప్‌కి పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతినడంతో మాల్దీవులు ఇప్పుడు సమస్యలతో సతమతమవుతున్నది. పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవులకు భారత్ నుంచి వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
మాల్దీవుల పర్యాటకుల విషయంలో మొదటి స్థానంలో ఉండే భారత్.. ప్రస్తుతం ఆరోస్థానానికి చేరింది. అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఏడాదిలో ఏప్రిల్ 10 నాటికి మాల్దీవులకు మొత్తం 6,63,269 మంది టూరిస్టులు వచ్చారు. ఇందులో భారత్ నుంచి వెళ్లిన వారు కేవలం 37,417 మాత్రమే. గతంలో ఈ సంఖ్య లక్షల్లో ఉండేది.