వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని, మేము మీకు అండగా ఉంటామని, మీ కష్టానికి తగ్గ ఫలితాన్ని 1, 2 నెలల్లో చూస్తారని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ డీ కుమారస్వామి భరోసా కల్పించారు. విశాఖ పర్యటనలో భాగంగా గురువారం ప్లాంట్ ను సందర్శించారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు ఎదుర్కొంటున్న సమస్యలపై విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కేంద్రమంత్రికి క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఇక్కడి ఎసెమ్మెస్-2లో కార్మిక సంఘాల నేతలతో కుమారస్వామి మాట్లాడారు. ఈ ప్లాంట్ ను సందర్శించిన తరువాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ దేశ ఆర్థికాభివృద్ధికి. ఎంతగానో సహాయ పడుతుందని అర్థమైందన్నారు. అనేక కుటుంబాలు వారి రోజు వారీ అవసరాలు, జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైనే ఆధారపడి ఉన్నారని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్లాంట్ ను పరిరక్షించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందొద్దని, ప్రధాని మోడీ ఆశీస్సులు, సహాయంతో ఈ ప్లాంట్ శతశాతం సామర్థ్యం తో ఉత్పత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Share