Current Date: 19 Nov, 2024

ఆర్టీసీ డ్రైవర్ రోడ్డుపై డ్యాన్స్ వివాదం.. స్పందించిన నారా లోకేష్

కాకినాడ జిల్లా తుని ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.‘డ్యాన్స్‌ సూపర్‌ బ్రదర్‌’ కీప్‌ ఇట్‌ అప్‌. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా బస్సు ప్రయాణికులు మీ డ్యాన్స్ ఆస్వాదించారు అనుకుంటున్నాను అని నారా లోకేష్ రాసుకొచ్చారు.  ఈ నెల24న తుని డిపోనకు చెందిన బస్సు రౌతులపూడి నుంచి తుని వస్తోంది.. అయితే కోడూరు, గిడజాం సమీపంలో ఎదురుగా కర్రల లోడు ట్రాక్టర్‌ రోడ్డులో నిలిచిపోయింది. సింగిల్ వే.. మట్టి రోడ్డు ఇరుకుగా ఉండటంతో బస్సు ముందుకు, వెనక్కి వెళ్లలేకపోయింది. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు బస్సును నిలిపివేశారు.. ఈ సమయంలో డ్రైవర్‌ సరదాగా బస్సు ముందు నిలబడి డ్యాన్స్ చేశారు. ఈ సమయంలో ఓ యువకుడు వీడియో తీయగా.. ఆ తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. కొంతమంది నెటిజన్లు మాత్రం.. డ్రైవర్‌ విధి నిర్వహణలో అలక్ష్యం వహిస్తూ ప్రయాణికులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ వీడియోను ట్వీట్ చేశారు. దాంతో ఆర్టీసీ అధికారులకు విషయం తెలిసి తాత్కాలికంగా విధులు కేటాయించలేదు. 

Share