ఆస్ట్రేలియా, టీమిండియా మధ్య మరో నాలుగు రోజుల్లో బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ సిరీస్ షురూ కానుంది. పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి మొదటి టెస్టు ప్రారంభం అవుతుంది. ఈసారి కూడా సిరీస్ తో ట్రోఫీ చేజిక్కించుకునేందుకు కసిగా ఉన్న భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకుని ప్రాక్టీస్ కూడా చేస్తోంది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ తన భార్య డెలివరీ కావడంతో భారత్ లోనే ఉన్నారు. హిట్ మ్యాన్ సతీమణి రితికా సజ్దే మగబిడ్డకు జన్మనిచ్చింది.పితృత్వాన్ని ఆస్వాదించేందుకు రోహిత్ మరికొన్ని రోజులు భారత్ లోనే ఉండనున్నారట. దాంతో వైస్ కెప్టెన్ గా ఉన్న జస్ ప్రీత్ బుమ్రా పెర్త్ టెస్టులో భారత జట్టును ముందుండి నడిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే బుమ్రా ఓసారి భారత టెస్టు జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించారు.2022లో ఎడ్ బాస్టన్ వేదికగా ఇంగ్లండ్ తో మ్యాచుకు ముందు హిట్ మ్యాన్ కోవిడ్ బారినపడి, పూర్తి ఫిట్నెస్ లేకపోవడం వల్ల బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే.. ఆడిలైడ్‌లో డిసెంబరు మొదటి వారంలో జరిగే రెండో టెస్టుకు ముందు రోహిత్ జట్టులో చేరనున్నట్లు సమాచారం.
Share