Current Date: 19 Nov, 2024

స్పేస్‌ఎక్స్, ఇస్రో సహకారంలో తొలి ప్రయోగం గ్రాండ్ సక్సెస్..

అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో ఉన్న లాంచ్ కాంప్లెక్స్ 40 నుంచి మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రయోగం చేపట్టారు. అత్యంత సంక్లిష్టమైన, కీలకమైన ఈ శాటిలైట్ 34 నిమిషాలు ప్రయాణించి లక్షిత కక్ష్యలోకి చేరింది  

Share