Current Date: 05 Oct, 2024

5 శాతం భూభాగాన్ని కోల్పోనున్న విశాఖ!

వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లోని తీర ప్రాంత నగరాలకు రానున్న కాలంలో భారీముప్పు పొంచి ఉందా..? ముంబయి, విశాఖపట్నం, కోచి, మంగళూరు లాంటి నగరాల్లో కొంత మేర భూభాగం సముద్రంలో మునిగిపోనుందా ? ఈ నగరాల్లో సముద్ర మట్టాల స్థాయిలు భారీగా పెరగనున్నాయా..? అవుననే చెబుతోంది బెంగళూరుకు చెందిన సెంటర్‌ ఫర్‌ స్టడీ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ పాలసీ (సీఎస్‌టీఈపీ). ఈ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం  2040 నాటికి ముంబయి 10 శాతానికి పైగా మునిగిపోనుంది. వాతావరణ మార్పులతో సముద్ర మట్టాల స్థాయిలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. గోవా రాజధాని పణజీ కూడా 10 శాతం భూభాగాన్ని కోల్పోనుంది. కోచి, మంగళూరు, విశాఖపట్నం, ఉడిపి, పూరి నగరాలకూ ముంపు ముప్పు ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ నగరాలు 5 శాతం వరకు భూభాగాన్ని కోల్పోనున్నాయని హెచ్చరించింది. చెన్నై, ముంబయి, తిరువనంతపురం, కోచి, మంగళూరు, విశాఖపట్నం, కోజికోడ్‌, హల్దియా, పణజీ, కన్యాకుమారి, పూరి, ఉడుపి, పారాదీప్‌, తూత్తుకుడి, యానాం నగరాలను ఈ సంస్థ తన అధ్యయనానికి ఎంచుకుంది.

Share