Current Date: 31 Mar, 2025

బాబోయ్ ఎండలు.. 47మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. ఎండ వేడితోపాటు వడగాల్పులు తోడవుతుండటంతో మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఎండల తీవ్రత పెరిగింది. తాజాగా.. ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏపీలో ఇవాళ 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, 199 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు 79 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 186 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 14, పార్వతీపురంమన్యం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో రెండు, కాకినాడ జిల్లాలో నాలుగు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలాల్లో ఇలా మొత్తం 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Share