Current Date: 31 Mar, 2025

మ్యాచ్ జ‌రుగుతుండ‌గా.. మైదానంలోకి దూసుకువ‌చ్చి మ‌రీ రియాన్ ప‌రాగ్ కాళ్లు మొక్కిన అభిమాని

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌గా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోగా..  గౌహ‌తి వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ 8 వికెట్ల తేడాతో ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘ‌ట‌న చోటు చేసుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓ అభిమాని సెక్యూరిటీ క‌ళ్లు గ‌ప్పి మైదానంలోకి ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చాడు. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ ప‌రాగ్ కాళ్లు మొక్కాడు. అనంత‌రం అత‌డిని కౌగిలించుకున్నాడు. ఇన్నింగ్స్ 11వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఈ ఓవ‌ర్‌ను ప‌రాగ్ వేశాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంత‌రాయం క‌లిగింది. 

Share